తెలంగాణకు 4, 212 స్మార్ట్ క్లాస్​రూమ్​లు

తెలంగాణకు 4, 212 స్మార్ట్ క్లాస్​రూమ్​లు
  • రాజ్యసభలో ఎంపీ అనిల్ ప్రశ్నకు కేంద్రం సమాధానం

న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణ రాష్ట్రానికి ఇప్పటి వరకు 4. 212 స్మార్ట్ క్లాస్ రూమ్​లు అప్రూవ్ చేసినట్లు కేంద్రం వెల్లడించింది. బుధవారం రాజ్యసభలో ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ అడిగిన ప్రశ్నకు కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి జయంత్ చౌదరి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 2018–19 లో ప్రవేశపెట్టిన సమగ్ర శిక్షా స్కీంలో భాగంగా ప్రభుత్వ, ఎయిడెడ్ స్కూల్స్ లో 6–12 వ తరగతి వరకు స్మార్ట్ క్లాస్ రూంలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

ఈ స్మార్ట్ క్లాస్ రూమ్‌‌‌‌‌‌‌‌ల కోసం నాన్-రికరింగ్ గ్రాంట్ (పాఠశాలకు 2 స్మార్ట్ క్లాస్‌‌‌‌‌‌‌‌ రూంలు) రూ.2.40 లక్షలు, రికరింగ్ గ్రాంట్ రూ.38 వేలు- (ఈ– కంటెంట్, డిజిటల్ వనరులు, విద్యుత్ చార్జీలతో సహా) ఆర్థిక సహకారం అందిస్తున్నట్లు మంత్రి తన సమాధానంలో పేర్కొన్నారు.